ఏపీలో మరో రచ్చ.. వలంటీర్లతో షాకింగ్ సర్వే..?

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో వలంటీర్లు శుక్రవారం నుంచి సర్వే ప్రారంభించారు. వీరంతా స్వాతంత్య్ర దిన వేడుకలలో పాల్గొని ఆయా గ్రామాల కా ర్యాలయాల్లోని అధికారులకు రిపోర్టు చేశారు. ప్రజాప్రతి నిధులు, అధికారులు వీరికి ఐడీ కార్డులు కూడా అందజేశారు. ఇన్‌చార్జి డీపీవో, జడ్పీ సీఈవో సూర్య ప్రకాశరావు సూ చనల మేరకు జిల్లా వ్యాప్తంగా తమకు కేటాయించిన ప్రాంతాల్లో వలంటీర్లు సర్వే చేస్తున్నారు.

వలంటీర్లకు కేటాయించిన 50 గృహాలలో అన్ని రకాల సమాచారాన్ని సేకరించాల్సి ఉంది. వలంటీర్లు అడిగిన సమాచారాన్ని కొంత మంది చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ప్రధానంగా బ్యాంక్‌ ఖాతా నెంబర్లు ఇవ్వడానికి సుముఖంగా లేరు. కొంత మంది వలంటీర్లకు వ్యక్తిగత సమాచారం ఇవ్వడానికి అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు నెంబర్లు వంటివి మీకెందుకు..?’ అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తుండడంతో వలంటీర్లకు స మాచార సేకరణ కష్టమవుతోంది. అంతే కాకుండా కొన్ని చోట్ల సమాచార సేకరణకు వెళ్లినపుడు అంతేకాకుండా కొన్ని చోట్ల విద్యా వంతులు వేసే ప్రశ్నలకు వలంటీర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు.జిల్లాలో కృష్ణానది తీర ప్రాంతాలైన నాగార్జున సాగర్‌, ప్రకాశం బ్యారేజి, పులిచింతల ప్రాజెక్ట్‌ల పరిసర ప్రాంతాలు అనేకం వరదల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా వరద ముప్పును ఎదుర్కొంటున్న మాచవరం, బెల్లంకొండ, మాచర్ల, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, భట్టిప్రోలు, కొల్లూరు, అమరావతి, అచ్చంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం వరద నీరు చేరడంతో అక్కడ వలంటీర్లు సర్వే చేయలేకపోయారు. అయితే వారంతా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు ఇన్‌చార్జి డీపీవో సూర్యప్రకాశ్‌ ఫోన్‌లో తెలిపారు.

కొన్ని ప్రాంతాల్లో షాడోలు, బినామీలు వివ రాల సేకరణకు వెళ్లినట్లు ప్రభుత్వానికి నిఘా వర్గాల సమాచారం అందింది. అధికార పార్టీ కీలక నేతల సిఫార్సుల మేరకు ఎమ్మెల్యేలు వైసీపీ నేతల వారసులకు ప్రధానంగా భార్య, కుమార్తె పేర్లతో వలంటీర్లను ఎంపిక చేశారు. భార్య, కుమార్తె బదులు బినామీలు, షాడోలు ఆయా ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.