జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మారుతోందా…!

రాష్ట్రంలో పాల‌న ప్రారంభించిన జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. దీనికి కీల క‌మైన కార‌ణం కూడా ఉంది. ఆయ‌న అనేక రాజ‌కీయ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న స‌మ‌యంలోనూ ఆ యన‌కు చెందిన మీడియా కానీ, సిమెంటు కానీ, ఇత‌ర అనేక సంస్థ‌ల విష‌యంలో చాలా ఆచితూచి వ్య‌వహ రించారు. ఎన్ని క‌ష్టాలైనా ఎదుర్కొన్నారు త‌ప్ప‌.. ఎక్క‌డా ఇబ్బంది ప‌డిన సంద‌ర్భాలు లేవు. అదేస‌మ‌యం లో ఆయ‌న‌కుతోడుగా ఆడిట‌ర్ విజ‌యసాయి కూడా ఉన్నారు. ఎలాంటి ఆర్థిక క‌ష్టాల నుంచైనా ఇట్టే బ‌య‌టకు రావ‌డంలో ఇద్ద‌రూ సిద్ధ‌హ‌స్తులే.ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ సంస్థ‌లు ఇబ్బందుల‌ను కూడా సునాయాసంగా దాటుకుని ముందుకు వ‌చ్చాయి. ఆర్థికంగా లాభాల ప‌ట్టాయి. ఎన్ని వైపుల నుంచి ఆర్థిక స‌మ‌స్య‌లు చుట్టు ముట్టినా.. కూడా సంస్థ‌లు త‌ట్టుకు న్నాయి.

మ‌రి ఇలాంటి జ‌గ‌న్‌, సాయిరెడ్డిలు రాజకీయాల్లో ఉన్న నేప‌థ్యంలో ఏపీలో ప‌రిస్థితి ఎలా ఉండాలి? ఏపీ ఎలా ముందుకు సాగాలి? అప్పుల ఊబి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తూ.. లాభాల బాట ప‌ట్టాల్సిన రాష్ట్రం ఇప్పుడు అనేక చిక్కుల్లో ఇరుక్కు పోవ‌డం వెనుక జ‌గ‌న్ వ్యూహం పెద్ద‌గా ప‌నిచేయ‌డం లేదా? లేక అస‌లు ఆయ‌న వ్యూహాత్మ‌కంగానే వ్య‌వ‌హ‌రించ‌డం మానేశారా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారేస‌మ‌యానికి అంటే మే నెల నాటికి ఇప్ప‌టి ప్ర‌భుత్వం చెబుతున్న లెక్క‌ల ప్ర కారం.. 80 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు పంచిన ప‌సుపు కుంకుమ‌, అ న్న దాత సుఖీభ‌వ వంటి కీల‌క‌మైన ప‌థ‌కాలు ప్ర‌బుత్వానికి పెను భారంగా ప‌రిణించ‌డంతో రాజ‌ధాని బాం డ్లు అమ్మ‌కానికి పెట్టిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఈ ప‌రిస్తితి నుంచి రాష్ట్రాన్ని బ‌య‌ట‌కు ప‌డేయాల్సి న జ‌గ‌న్‌.. ఇప్పుడు అనుస‌రిస్తున్న విధానం వ‌ల్ల‌.. మ‌రింత‌గా అప్పుల దిశ‌గా రాష్ట్రం న‌డుస్తోంద‌నే వాద‌న వి నిపిస్తోంది. తొలి ఆరు మాసాల్లోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం వివిధ రూపాల్లో 25 వేల కోట్ల‌ను అప్పుగా తీసుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.అదేస‌మ‌యంలో తొలి మాసంలోనే 10 వేల కోట్లు అప్పు తీసుకుంద‌ని, దీనిని కేంద్రం కూడా స‌హించ‌లేక పోయింద‌ని, రాష్ట్రంపై ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేసింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో మున్ముం దు ఇప్పుడు ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌ను అమ‌లు చేసేందుకు మ‌రింత‌గా డ‌బ్బులు అవ‌స‌రం అవుతాయ నేది నిపుణుల వాద‌న‌. పైగా కేంద్రం నుంచి వ‌చ్చేది కూడా త‌గ్గిపోయింది. ఇప్ప‌టికే రాజ‌ధానికి ఇచ్చే నిధుల్లో చాలా ఇచ్చేశామ‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పాటించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఆయ‌న ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి.