అమిత్ షాను త‌క్కువ అంచ‌నా వేసి బోక్క బోర్లా పడ్డ జగన్

సాధారణంగా… బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విషయంలో చాలా వరకు రాష్ట్రాలు చాలా వరకు జాగ్రత్తగానే ఉంటాయి. ఆయనతో ఎంత మేర సఖ్యతగా ఉండటానికే చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఆయన ప్రధాని కన్నా శక్తివంతమైన వ్యక్తి అనే ప్రచారం ఉంది. రాష్ట్రాలను ఆయన కనుసైగలతో శాసిస్తారు అనే పేరు కూడా ఉంది. అమిత్ షా సీన్ లో దిగనంత వరకే… ఒక్కసారి ఆయన రంగంలోకి దిగితే పరిస్థితులు ఏ విధంగా మారతాయో ఊహకు కూడా అందవని ఆయన గురించి తెలిసిన వారు చెప్పే మాట.అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అధికార వైసీపీ అమిత్ షా విషయంలో చాలా లైట్ తీసుకుందని అంటున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరి విషయంలో కేంద్రం ఆరా తీస్తుంది అనే సమాచారం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అందింది. అయినా సరే… కొన్ని కొన్ని నిర్ణయాలను తీసుకునే ముందు ఒక్కసారి కూడా ఆలోచించే ప్రయత్నం చేయలేదు.రాష్ట్రానికి మానవ హక్కుల సంఘం వస్తే బాధితులను కలవనీయకుండా పల్నాడులో ఇబ్బంది పెట్టారు. అలాగే ఇసుక కొరత దెబ్బ కేంద్ర ఆర్ధిక వ్యవస్థ మీద కూడా పడింది. ఆ కొరతను తగ్గించమని… ఇసుక విషయంలో జాగ్రత్తగా ఉండమని సంకేతాలు వచ్చాయి. ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో దూకుడు తగ్గించమని కూడా కేంద్రం నుంచి పరోక్షంగా సంకేతాలు వచ్చాయి. ప్రధాని వీటి గురించి పెద్దగా ఆలోచించరు.అమిత్ షానే… ఇక ఢిల్లీలో వైసీపీ ఎంపీలు బిజెపి నేతలను కలుస్తుంటే హెచ్చరికలు చేస్తున్నారు.

ఇవన్ని అమిత్ షాకి చికాకు తెప్పించాయని అంటున్నారు. అమిత్ షా అందుకే జ‌గ‌న్‌ను కలవడానికి కూడా ఇష్ట‌పడలేదని… పుట్టిన రోజు నాడు అందరూ లోపలి వచ్చి… ఆయన్ను ఒక్కడినే బయట నిలబెడితే బాగోదు అనే భావనలోనే లోపలి పిలిచారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. భవిష్యత్తులో షా తో ఏపీ స‌ర్కార్‌కు మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

"
"