దక్షిణాదే దిక్కు… మంత్రాంగం మొదలుపెట్టిన అమిత్ షా

రనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుండడంతో బీజేపీకి ఇప్పుడె కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. నాలుగేళ్లకె మోడీ ప్రతిష్ట మసకబారి పోవడంతో… వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రధాని అభ్యర్థిత్వంపై ఆర్ఎస్ఎస్ పునరాలోచన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దింపుడు కళ్ళెం ఆశతో మోడీ మిత్రుడు బీజేపీ చీఫ్ అమిత్ షా రంగంలోకి దిగారు. మోడీకి మద్దతు కూడగట్టడం… వచ్చే ఎన్నికల్లో గౌరప్రదమైన సీట్లతో బయటపడడం లక్ష్యంగా షా రాజకీయ కార్యాచరణ మొదలుపెట్టారు. ఈ నేపద్యంలో ఉత్తరాదిలో సీట్లు వస్తాయన్న ఆశ లేకపోవడంతో అఫుకోవాల్సింది దక్షిణాది అని గుర్తించిన మోడీ… షాలు దక్షిణాదిపై ఫోకస్ పెట్టారు. అయితే చంద్రబాబు తో పెంచుకున్న వైరం… ఆంధ్రాకు చేసిన ద్రోహం… కేరళలో రేపిన చిచ్చు వెరసి ఇక్కడ ఏ సైట్ లోనూ బీజేపీకి సింగిల్ నెంబర్ సీట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. అయినా సరే ఏదో కొద్దోగొప్పో బిజిపి జెండాలు కనిపించే కర్ణాటకపై షా దృష్టి పెట్టారు.

ఆ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సూచన మేరకు రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కీలక నేతలంతా ఢిల్లీ చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం మ ధ్యాహ్నం అమిత్‌షా రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్‌, జేడీఎ్‌సలలో చోటుచేసుకున్న అసంతృప్తిపై ప్రత్యేకంగా చర్చ సాగినట్లు తెలుస్తోంది. ఎవరెవరు… కాంగ్రె్‌సలో వ్యతిరేకులు ఉన్నారో… జే డీఎ్‌సలో ఎంతమంది అనేది అంచనా వేశారు. ఇప్పటికే బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉండేవారి పేర్లను పరిశీలించినట్లు సమాచారం. నిత్యం జేడీఎస్‌, కాంగ్రెస్‌ కీలకుల మధ్యనే మనస్పర్థలు బహిరంగం అవుతున్నాయని చర్చించినట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం నేనో క్లర్క్‌నని కాంగ్రెస్‌ నే తల ఒత్తిడితో ప్రభుత్వాన్ని సక్రమంగా నిర్వహించలేకపోతున్నాననే అంశంపైనా కీలకమైన చర్చ జరిగినట్లు సమాచారం. దక్షిణాదిన కొంచం బలంగా కనిపిస్తున్న క ర్ణాటక నుంచే ఎక్కువ సీట్లు సాధించాలని అమిత్‌షా సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు గాను నియోజకవర్గాల వారీగా టికెట్‌ల కేటాయింపుపైన ప్రాథమికంగా జరుగుతోంది. కలబుర్గి నుం చి మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి రత్నప్రభ అభ్యర్థిత్వంపైన చర్చించినట్లు తెలుస్తోంది. బెంగళూరు దక్షిణ నుంచి అనంతకుమార్‌ లేని లో టును తీర్చేందుకు అతడి భార్య తేజస్వినికి టికెట్‌ ఇచ్చే అంశం కూడా చర్చలో భాగమైనట్లు సమాచారం.

ప్రస్తుతం సిట్టింగ్‌లందరికీ టికెట్‌లు ఇచ్చే అంశం ప్రాథమికంగా తేల్చారు. అయితే నలుగరైదుగురిని పార్టీలో పదవులకు మళ్ళించాలనే ఆలోచన కూడా లేకపోలేదు. కర్ణాటకలో అవకాశం వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మరింత వెసలుబాటు ఉంటుందని కొందరు ప్రతినిధులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా పాల్గొన్నారు. శనివారం రాష్ట్ర బీజేపీ ప్రజా ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్రమోడి చర్చలు జరిపే అవకాశం ఉంది. ఎలాగైనా ఇక్కడి నుంచి కొంత సానుకూలత సాధించాలని మోడీ… షా పావులు కదుపుతున్నారు.