అమరావతిపై కావాలనే కుట్ర పన్నుతున్నారు

నేడు మంగళవారం నాడు కృష్ణ జిల్లా అవనిగడ్డలో వరద ముంపు బాధితులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పని తీరుపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఏపీ రాజధాని అమరావతిని ముంపు ప్రాంతంగా చిత్రీకరించి, రాజధాని నిర్మాణాన్ని కావాలనే నిలిపేస్తున్నారని చంద్రబాబు నాయుడు తీవ్రమైన విమర్శలు చేశారు.

ఏపీలో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడుతున్నారు. కాగా రాజధాని నిర్మాణం కోసం రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారని, అయితే ఈ భూముల్లో కొన్ని మౌలిక వసతుల కోసం భూముల్ని కేటాయించినప్పటికీ కూడా 8 వేల ఎకరాల వరకు మిగులుతుందని చెప్పారు.అయితే ఆ భూమిని అమ్మినప్పటికీ కూడా ఎలాంటి ఎక్కువ ఖర్చు లేకుండా రాజధానిని నిర్మించవచ్చని చంద్రబాబు అన్నారు. అయితే ఏపీలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణాలు నిలిచిపోయాయని చంద్రబాబు తీవ్రమైన విమర్శలు చేశారు. కేవలం రాజధానిని మార్చాలనే కుట్రతోనే ముంపు ప్రాంతాలు అని రచ్చ చేస్తున్నారని, చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

ఇకపోతే అమరావతి నిర్మాణం పై మంత్రి బొత్స దారుణంగా మాట్లాడుతున్నారని, ఇలాంటి కుట్రలు, కుతంత్రాలను ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు ప్రజలకు సూచించారు.