కేసీఆర్ తో ఏం మాట్లాడినట్టు.. జగన్ ను ఇరికిస్తున్న టీడీపీ నేతలు

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలన ని వదిలెసాడు. అంతా తెలంగాణ సీయం చుట్టు తిరుగుతున్నాడని మాజీ జలవనరుల శాఖా మంత్రి దెవినేని ఉమామహెశ్వరరావ్ తెలిపారు. అసలు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏందుకు కలుసుకుంటున్నారో అర్థం కావడం లెదని తెలిపాడు. తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సమావేశమై ఏ విషయాలపై చర్చించారో రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ప్రజల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై ఉందన్నారు. ఆదివారం విజయవాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ బాటలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నడుస్తున్నారని విమర్శించారు. కేంద్ర జలశక్తి శాఖ కోరిన ఎజెండా పంపటానికి సీఎం ఎందుకు విముఖత చూపుతున్నారని ప్రశ్నించారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏమడిగారని ప్రశ్నించారు.

ఎన్నికల్లో పోలవరం కేసులు ఎత్తివేస్తామన్న కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోలేదని, ఈ విషయాన్ని జగన్‌ ఎందుకు అడగరని ప్రశ్నించారు.జగన్‌ రైతుల ప్రయోజనాలను కాపాడటం లేదన్నారు. కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ కలసి చూసుకోవటానికి కృష్ణాజలాల విషయం వారి ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్‌లో 170 ఎకరాల పంచాయతీ కాదన్నారు. పోలవరం ఎత్తు తగ్గించటానికి జగన్‌ అంగీకరించారని కేసీఆర్‌ తెలిపారని, పోలవరం ఎత్తు తగ్గించటానికి జగన్‌కు హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. కేసీఆర్‌ మాటలకు జగన్‌ ఎందుకు నోరు మెదపటం లేదని, కృష్ణాజలాల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. 5 వేలకోట్ల విద్యుత్‌ బకాయిల గురించి జగన్‌ ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు.జగన్‌ పాలన మొత్తం ప్రతీకారం చుట్టూనే పరిభ్రమిస్తోందని, ప్రతీకారంపై చూపే శ్రద్ధ పాలనా వ్యవహారాలపై చూపడం లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు ఓ ప్రకటనలో విమర్శించారు. ‘ఏపీలో టీడీపీ ఓడిపోయి జగన్‌ వస్తే అమరావతి అభివృద్ధి నిలిచిపోయి హైదరాబాద్‌ మరింత పుంజుకుంటుందన్నది కేసీఆర్‌ ఆశ. దానిని జగన్‌ అక్షరాలా నిజం చేసి చూపిస్తున్నారు. కేసీఆర్‌ ఆదేశాలను జగన్‌ అక్షరాలా పాటిస్తూ ఏపీ ప్రజలకు తీరని నష్టం కలిగిస్తున్నారు’ అని ఆరోపించారు.

జగన్‌ వైఖరి చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని, నాలుగు నెలల పాలనలో ప్రతి రంగం సంక్షోభంలోకి వెళ్లిందని పేర్కొన్నారు. పనికొచ్చేవి పడగొట్టడం, రాష్ట్ర ప్రతిష్టను చెడగొట్టడం అన్న విధంగా జగన్‌ వ్యవహార శైలి ఉందని విమర్శించారు. నవరాత్రుల సమయంలో తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కొండవీటి చాంతాడంతమంది సభ్యులను టీటీడీ బోర్డులో వేశారని, భక్తులు ఇంత ఇబ్బంది పడుతుంటే ఈ సభ్యులంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.