ఆళ్లగడ్డ వైసీపీకి బీటలు..! జగన్ ప్లాన్ చేసి మరీ తొక్కేసాడా..?

చెట్టు కొట్టి మీద వేసుకునేవాళ్లెవరంటే… రాజకీయాల్లో జగన్ అని ముందుగా చెప్పుకోవచ్చు. పార్టీ కోసం పని చేసిన వాళ్లని వదిలేసి… డబ్బులుంటాయని కొత్త వాళ్లని తీసుకొచ్చే పనిలో ఉంటారు జగన్.. ఈ ప్రయత్నం ఆళ్లగడ్డలోనూ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ గంగుల కుటుంబ వారసుడు బిజేంధ్రనాథ్ రెడ్డి పని చేసుకుంటూడగా.. కొత్తగా.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డిని పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించారట. వైసీపీ తరఫున పోటీచేసేందుకు గంగుల ప్రభాకర్‌రెడ్డి తనయుడు బిజేంద్రనాథ్‌రెడ్డి పూర్తిస్థాయిలో గ్రౌండ్‌వర్క్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో ఇరిగెల రాంపుల్లారెడ్డి కూడా 2019 ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి దిగుతానని చెప్తున్నారు. దీంతో ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్ధిత్వంపై గందరగోళం నెలకొంది. పార్టీలో చిచ్చు పెడుతున్నారని జగన్ పై గంగుల వర్గీయులు మండి పడుతున్నారు.

బిజేంద్రనాథ్‌రెడ్డే అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీచేస్తారని ఆళ్లగడ్డ వైసీపీ కార్యకర్తులు కూడా దాదాపుగా ఫిక్స్‌ అయ్యారు. ఈ క్రమంలో ఇరిగెల రాంపుల్లారెడ్డి అనూహ్యంగా జగన్ పార్టీ గూటికి చేరేందుకు రంగం సిద్ధంచేసుకున్నారు. దశాబ్దాల క్రితంనుంచి రాజకీయంగా ఇరిగెల, గంగుల కుటుంబాలు బద్ధశత్రువులు. ఇప్పుడు ఇరిగెల రాంపుల్లారెడ్డి వైసీపీలోకి వచ్చి.. గంగుల బిజేంద్రనాథ్‌ రాజకీయ జీవితాన్ని దెబ్బతీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి 2014 ఎన్నికల ముందు వీరిద్దరూ టీడీపీలోనే ఉన్నారు. గంగుల ప్రభాకర్‌రెడ్డి ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు టీడీపీ అధినాయకత్వం నిర్ణయం మేరకు ఇరిగెల రాంపుల్లారెడ్డి అప్పట్లో తన సీటును త్యాగం చేశారు. కానీ ఆయన గంగుల కోసం పని చేయకపోవడంతో ఓడిపోయారు.

వైసీపీలోకి రాంపుల్లారెడ్డి రావడానికి సిద్ధపడటం, ఆళ్లగడ్డ టిక్కెట్ ఆశిస్తుండటం వంటి అంశాలు జగన్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. గంగుల, ఇరిగెల రాంపుల్లారెడ్డి ఒక అవగాహనకు వచ్చాకే అభ్యర్ధిత్వంపై ఆలోచిస్తానని జగన్ వెల్లడించినట్టుగా చెబుతున్నారు. కానీ… జగన్ మనసులో మాత్రం.. ఇరిగెలే ఉన్నారు. ఆయన ఇప్పటికీ పార్టీలో చేరకపోయినా టిక్కెట్ హామీ ఇచ్చేసారు. గంగులకు ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చాం కాబ్టిట.. ఆళ్ల గడ్డ.. ఇరిగెలకు ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారు. మొత్తానికి లెక్క అక్కడ అలా తేలింది. ఆళ్లగడ్డ వైసీపీ చీలిక పేలికలయ్యే పరిస్థితి వచ్చింది.