మొట్టమొదటిసారి స్పందించిన అఖిల ప్రియ.. భర్త కేసులపై సంచలన వ్యాఖ్యలు

ఎపి మాజి మంత్రి భుమా అఖిలప్రియా తన భర్తపై వస్తూన్న అరోపనలకు స్పందించారు. మేం ఇలాంటివి చాలా చూసాం. మేము రాయలసీమ గడ్డలో పుట్టి పెరిగిన వాళ్ళం ఇలాంటి. తాటాకు చప్పుళ్ళకు భయపడం అని అమె తెలిపారు. ఇక మాపై ఎంత  బురద చల్లాలని ప్రయత్నించినా కుదరదని అమె తెలిపారు. అలాగే ఒక చిన్న గోడవను వెరె లాగా చిత్రికరిస్తున్నారని తెలిపింది. ఇక ఇప్పుడు మమ్మల్ని ఏలా ఇరికించాలో తెలియక ఇలాంటి పనులన్ని చేస్తున్నారని అమె తెలిపారు. ఇక ఏన్ని చెసిన మమ్మల్ని ఏం చేయలెరని అమె తెలిపారు.

ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన తాము.. ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్ని చూశామన్నారు. పారిపోవాల్సిన ఖర్మ తన భర్తకు పట్టలేదన్నారు. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తన భర్త భార్గవ రామ్‌‌పై నమోదైన కేసులపై ఘాటుగా స్పందించారు.భార్గవ రామ్‌పై తప్పుడు కేసులు పెడుతున్నారని.. పరారీలో ఉండాల్సిన అవసరం ఆయనకు లేదని స్పష్టం చేశారు.ఫ్యాక్షన్ కేసులకే భయపడనివాళ్లం… ఇలాంటి కేసులకు భయపడుతామా? అని ప్రశ్నించారు. తమ కుటుంబం పరువును దెబ్బతీసేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో తన తండ్రి భూమా నాగిరెడ్డిపై కూడా ఇలాగే కేసులు పెట్టి.. లేని పోని ప్రచారాలు చేశారని అన్నారు. ఇప్పుడు తన భర్తను టార్గెట్ చేశారని ఆరోపించారు. తమలాంటి వాళ్లనే తప్పుడు కేసులతో వేధిస్తుంటే.. ఇక సామాన్యుల పరిస్థితేంటని నిలదీశారు.

ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చిన తాము.. ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్ని చూశామన్నారు. పారిపోవాల్సిన ఖర్మ తన భర్తకు పట్టలేదన్నారు. ఒక చిన్న గొడవను హత్యాయాత్నం కేసుగా మార్చేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని మండిపడ్డారు.ప్రైవేటు వాహనాల్లో మఫ్టీలో వస్తే.. వాళ్లు పోలీసులేనని ఎలా తెలుస్తుందన్నారు. పోలీసులు ఆంధ్రా నుంచి ప్రైవేట్ వాహనంలో రావాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. తమపై పగబట్టిన కొందరు తమ పరువు తీయడానికే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశారు.అసలు ఇలాంటి కెస్లు పెట్టి మమ్మల్ని బయటకి రప్పించి మా పరువు తీయ్యాలని  ప్రయత్నిస్తున్నారని అది ఏన్నటికి కుదరదని అమె తెలిపారు.