అఖిల ప్రియ దూకుడు.. ఆ ప‌ద‌విపై క‌న్నేసిందా..!

రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చినా.. ఏదో ఒక‌టి ఆశించ‌కుండా ఏ ఒక్క‌రూ ఉండ‌ర‌నేది వాస్త‌వం. ఇప్పుడు క‌ర్నూలు జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కురాలు మాజీ మంత్రి, భూమా నాగిరెడ్డి వార‌సురాలిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన భూమా అఖిల ప్రియారెడ్డి ఉదంతం కూడా దీనికి ఉదాహ‌ర‌ణ‌గా మారింది. ఆమె ఇటీవ‌ల కాలంలో దూకుడు పెంచింది. వాస్త‌వానికి ఎవ‌రైనా ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత త‌గ్గిపోతారు. తాము ఎందుకు ఓడామో.. తెలుసుకునేందుకే చాలా స‌మ‌యం ప‌డుతుంది.రాజ‌కీయంగా ఎంతో దూకుడు గా ఉన్న నాయ‌కులు కూడా ఈ ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత చాలా మేర‌కు సైలెంట్ అయ్యారు.అయితే, చిత్రంగా అఖిల ప్రియ మాత్రం దూకుడు పెంచింది.

త‌న భ‌ర్త‌పై కేసులు అక్ర‌మంగా న‌మోదు చేస్తున్నారంటూ.. ఆమె నానా యాగీ చేసిన విష‌యం తెలిసిందే. అదేస‌మయంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపు మేర‌కు అనేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంది. స్వ‌యంగా తానే రంగంలోకి దిగి.. ఆయా కార్య‌క్ర‌మాల‌కు ఊపు తెచ్చింది.ఇక‌, ఆళ్ల‌గ‌డ్డ‌లో యురేనియం ని క్షేపాల త‌నిఖీ విష‌యాన్ని కూడా రాష్ట్ర స‌మ‌స్య‌గా మార్చింది. రాష్ట్రం మొత్తంత‌న‌వైపు తిప్పుకొనేలా పోరా టం సాగించింది. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపైనా ఆమె దూకుడు పెంచింది. తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసింది. దీంతో ఎన్న‌డూ పెద్ద‌గా అఖిల ప్రియ‌ను ప‌ట్టించుకోని చంద్ర‌బాబు.. అక‌స్మాత్తుగా ఆమెపై ప్ర‌శం స‌ల జ‌ల్లు కురిపించిన విష‌యం తెలిసిందే. అయితే, భూమా అఖిల ప్రియ ఈ త‌ర‌హా ఉద్య‌మాలు, నిర‌స‌న‌లు చేయ‌డం వెనుక చాలా వ్యూహ‌మే ఉందని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.ప్ర‌స్తుతం క‌ర్నూలు టీడీపీ అంతా స్త‌బ్దుగా ఉంది.ఈ క్ర‌మంలో ఆమె వీలును బ‌ట్టి జిల్లా పార్టీ ప‌గ్గాలు లేదా రాష్ట్ర స్థాయిలో ఏదో ఒక కీల‌క ప‌ద‌వి సొంతం చేసుకునే క్ర‌మంలోనే దూకుడుగా ముందుకు వెళుతున్న‌ట్టు తెలుస్తోంది.

పార్టీ ఓడిపోయాక చాలా మంది నేత‌ల‌పై వ‌చ్చిన‌ట్టుగానే అఖిల కూడా పార్టీ మారిపోతుంద‌ని పుకార్లు వ‌చ్చినా ఆమె మాత్రం అక్క‌డ వైసీపీకి గ‌ట్టి కౌంట‌ర్లు ఇస్తూ దూసుకు పోతోంది. పార్టీలో యువ మ‌హిళ‌ల ప్రాధాన్యం పెంచే క్ర‌మంలోనే బాబు ఆమెకు మంచి ప్ర‌యార్టీ ఇస్తారనే తెలుస్తోంది.