తలనొప్పిగా మారిన అమ్మఒడి.. ఇంత జరుగుతున్నా పట్టించుకోని అధికారులు

అమ్మ ఒడి పథకం.. పేదింటి విద్యార్థులకు ఒక వరం.. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన వెంటనే సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే విద్యార్థులకూ అమ్మఒడి పథకం అమలు చేయడం ఒక వరమని పాఠశాలల యాజమాన్యాలు సంతోష వ్యక్తం చేశాయి..అమ్మ ఒడి పథకంలో సొమ్ము ఎప్పుడు వస్తుందా అని ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులతో పాటు పాఠశాలల యాజమాన్యాలు కూడా ఎదురు చూసే పరిస్థితి ఎదురైంది..ఎందుకంటే ఫీజు కట్టమని అడిగితే అమ్మఒడి సొమ్ము వచ్చిన వెంటనే కడతామని అంటున్నారు…‘‘ ఫీజుకు ఎందుకు తొందర పెడతారు… మేమేమైనా పారిపోతామా ? అమ్మ ఒడి పథకంలో వచ్చే జనవరి 26న ప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుంది. ఆ సొమ్ములు తెచ్చి మీ ఫీజులు చెల్లిస్తాం.. మూడు నెలలుగా పనులు లేక ఇల్లు గడవడమే కష్టంగా ఉంటోంది.

కాస్తంత ఓపిక పట్టండి. ఫీజు తెమ్మని మాకు ఫోన్లు చెయ్యకండి. పిల్లల డైరీలలోనూ రాయద్దు.. ’’ అంటూ పలువురు పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలు చదివే పాఠశాలల యాజమాన్యాలకు సూచనలు చేస్తున్నారు. దీంతో ఆయా యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. ఫస్ట్‌ టర్మ్‌ ఫీజు ఇప్పటి వరకూ 30 శాతం వసూలు కాలేదని అధికశాతం పాఠశాలల యాజమాన్యాలు తెలుపుతున్నాయిజిల్లాలో సుమారు 400 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 150 వివిధ కార్పొరేట్‌ పాఠశాలలకు సంబంధించిన బ్రాంచిలు కాగా, 250 మధ్యతరహా, చిన్నతరహా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 150 పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య 100 లోపే. చిన్నతరహా పాఠశాలల్లో భార్య భర్త పనిచేస్తుంటారు. యాజమాన్యానికి చెందిన బార్య భర్తలు రోజంతా విద్యార్థులకు పాఠాలు చెప్పడానికే వెచ్చించినప్పటికీ నెలకు చెరో రూ.10 వేలు జీతం తీసుకోవడం గగనమవుతోందని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చిన్నతరహా ప్రైవేటు పాఠశాలల్లో సాధారణంగా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన విద్యార్థులే అధికంగా ఉంటారు. ఫీజులు ఆలస్యంగానే చెల్లిస్తుంటారు. యాజమాన్యాలు సానుభూతితోనే వ్యవహరిస్తూ అభ్యర్థపూర్వకంగానే ఫీజులు వసూలు చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అమ్మఒడి పెద్ద తంటా తెచ్చిపెట్టింది. జనవరి నెలవరకూ ఆగండి.. అమ్మఒడి సొమ్ము మా బ్యాంక్‌ ఖాతాలో పడిన వెంటనే తెచ్చి ఇస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతుంటే, ఏం చేయాలో పాలుపోక ఆయా యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. రాష్ట్రంలో కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 35 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో ఈసంఖ్య 2 లక్షలు పైబడి ఉంది. ఒకొక్క విద్యార్థికీ వార్సిక ఫీజు రూ. 15వేలు అనుకుంటే సుమారు రూ. 300 కోట్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.కార్పోరేట్‌ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలు ఆర్థికంగా ముందుకు వెళ్ళగలుగుతున్నప్పటికీ, చిన్న ప్రైవేటు పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో చేతులు ఎత్తివేస్తున్నాయి. అమ్మఒడి నిధులు వస్తేనే తమకు ఫీజులు వస్తాయనే స్థితికి ప్రైవేటు పాఠశాలలు వచ్చాయి. అమ్మఒడి పధకం ద్వారా లక్షలాదిమంది విద్యార్థులకు మేలు జరుగుతుందని, తల్లిదండ్రులు పిల్లల చదువులకు వెచ్చించే ఆర్ధిక భారం తగ్గుతుందని అయితే సొమ్ములు అకడమిక్‌ ఇయర్‌ ఆరంభంలోనే ఇస్తే మేలు చేకూరుతుందని పలువురు భావిస్తున్నారు.

అమ్మఒడి పథకం ప్రవేటు పాఠశాలలకు ఇచ్చి జగన్‌ మంచి పని చేశారు. మా పిల్లలు స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. వారికి అమ్మఒడి పథకం ద్వారా ఒక్కరికే అమలు కావడంతో మాకు కొంత ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకాన్ని ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఇవ్వాలి.అమ్మ ఒడి పథకం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లికి నేరుగా ఏడాదికి రూ. 15 వేలు అందించడంతో పేద కుటుంబాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. సొమ్ములు వెంటనే ఇస్తే మాకు మేలు చేసినట్టు అవుతుంది. మూడునెలలగా పనుల లేవు.. అప్పులు చేసుకుని బతుకుతున్నాం. ఆ సొమ్ము వస్తే అప్పులు తీర్చుకుంటాంఅమ్మఒడి పథకం ద్వారా అందజేసే మొత్తాన్ని ఎప్పుడో జనవరిలో కాకుండా పాఠశాలలు పునఃప్రారంభించిన వెంటనే ఇస్తే మెరుగ్గా ఉంటుంది. పథకం ప్రకటించిన అనంతరం ప్రభుత్వానికి ఈ ఏడాది కొంచెం ఆలస్యం అయినప్పటికీ వచ్చే ఏడాది నుంచి పాఠశాలలు తెరిచిన వెంటనే సొమ్ములు ఇస్తే ఉపయోగపడతాయి.అమ్మ ఒడి ద్వారా సొమ్ములు వస్తాయని, పిల్లలకు ఫీజులు కట్టడం అశ్రద్ధ చేశాం. ఇప్పడు ఫీజు కట్టకపోతే పిల్లలను స్కూలునుంచి పంపేస్తామంటున్నారు.

"
"