సీయం వచ్చినా భయపడేది లేదు.. అచ్చెన్నాయుడు ఘాటు రిప్లై

ఏపీలో కోద్ది రోజులుగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి టీడీపీ నెతల మాట్లాడే గొంతులను నోక్కేస్తున్నారని  అచ్చెంనాయుడు   తెలిపాడు. అలాగే వైసీపీ నెతలు రాష్ట్రంలో వున్న ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అయన తెలిపాడు. గెలిచే వరకూ ప్రజలకోసం పుట్టునట్టు వైసీపీ నెతల హంగామా అంతా ఏం  అయ్యిందని అయన  ప్రశ్నించాడు. అలాగే వైసీపీ నెతలు గత కోన్ని రోజులుగా టీడీపీ నెతలను టార్గేట్ చేశారని అయన మండిపడ్డారు. ఇక ప్రజల సమస్యల గురించి చర్చించేటప్పుడు ఏవరైనా అడ్డం రావాలని ప్రయత్నించినా  ప్రజల కోసం టీడీపీ పోరాటం అగదని అయన తెలిపాడు. అలాగే  వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడం లెదని అయన విమర్శలు చేశాడు.

‘మాజీ సీఎం చంద్రబాబు అమరావతి పర్యటనలో బస్సుపై జరిగిన దాడి ఘటనపై సిట్‌ విచారణతో పాటు, ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా విచారించినా మాకేమీ భయం లేదు. జరిగిన వాస్తవాలను ప్రజలముందు ఉంచటమే మాకు కావాలి’ అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం ఆయన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, తదితరులతో కలిసి విజయవడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దాడి ఘటనపై కేంద్రానికి ఫిర్యాదు చేయబట్టే విచారణకు సిట్‌ ఏర్పాటు చేశారని అన్నారు. దాడికి పాల్పడిన వారు తెనాలి, కడప నుంచి వచ్చినట్టు ఒప్పుకున్నారని అన్నారు. రాజధాని తరలింపును నిరసిస్తూ, అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తూ 5న అఖిలపక్ష నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్టు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్‌ వల్లే అమరావతి నిలిచిపోయిందని వర్ల రామయ్య ఆరోపించారు.