అచ్చెన్నకు ఆ పదవి ఇచ్చి ఉండాల్సిందా…?

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు… రాజకీయంగా ఇబ్బందులు పడుతుంది. ఈ క్రమంలో బలపడాలి అంటే… అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలి… ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె విధంగా విమర్శలు చెయ్యాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం భవిష్యత్తు అనేది కష్టం… ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు కూడా ప్రభుత్వాన్ని ప్రభావితం చెయ్యాలి… ఉన్న నేతలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలి… ఇచ్చే పదవుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి… ఇప్పుడు ఈ విషయంలో విపక్ష తెలుగుదేశం విఫలం అనే ఆరోపణలు వస్తున్నాయి.కీలకమైన ప్రజా పద్దుల కమిటి విషయంలో పార్టీ పెద్ద తప్పు చేసింది అనే అభిప్రాయలు వినపడుతున్నాయి.ప్రజా పద్దుల కమిటి చైర్మన్ గా… పయ్యావుల కేశవ్ ని నియమించారు. ఈ పదవి చాలా కీలకం.

ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి మీద దీనికి అవగాహన ఉంటుంది. కేబినేట్ ర్యాంక్ ఉన్న పదవి అది. కాని ఆ పదవి విషయంలో పయ్యావుల ఘోరంగా విఫలం అయ్యారనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆయన ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించలేదు.ప్రభుత్వంపై విమర్శలు చేసింది గాని లెక్కల గురించి, అప్పుల గురించి మాట్లాడింది గాని ఏ ఒక్కటి లేదు. ఇప్పుడు కార్యకర్తల నుంచి ఒక డిమాండ్ వినపడుతుంది. ఆ పదవిని సీనియర్ నేత అచ్చెన్నాయుడుకి ఇచ్చి ఉండాల్సింది అంటూ అభిప్రాయపడుతున్నారు పలువురు. ఆయన ప్రభుత్వంపై ధైర్యంగా విమర్శలు చేస్తారు. అసెంబ్లీలో కూడా ఆయన ప్రసంగిస్తే ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. అందుకే జగన్ మరో మార్గం లేక ఆయనపై వ్యక్తిగత దూషణలకు కూడా దిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆ పదవి ఆయనకు ఇచ్చి ఉంటే… ప్రభుత్వం ఇబ్బంది పడి ఉండేదని… దీనిని తెలుగుదేశం సమర్ధవంతంగా వాడుకోలేకపోయిందని అంటున్నారు.