నల్లమల కోసం…గళమెత్తిన ప్రముఖులు

ఇప్పుడు కెంద్ర ప్రభుత్వం యురేనియం కోసం నల్లమల్ల ఫారేస్ట్ ని నరికివేయమని కేంద్రం అదేశించడంతో పలువులు సినిమా సేలబ్రేటిలు దీనిని ఖండిస్తున్నాడు.మన ప్రకృతి ని ఇలా మ్మనకు మనమే నాశనం చేసుకోవడం తప్పని పలువులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేపట్టిన ‘సేవ్‌ నల్లమల’ ఉద్యమానికి భారీ స్పందన లభిస్తోంది. ప్రకృతి సంపదకు నిలయమైన నల్లమల అడవులను కాపాడుకుందామంటూ పలువురు సెలెబ్రిటీలు ట్వీట్‌లు చేస్తున్నారు. ప్రముఖ పిటిషన్‌ వెబ్‌సైట్‌ change.org ద్వారా ఆన్‌లైన్‌లో సంతకాలు సేకరిస్తున్నారు. పిటిషన్‌ లింక్‌ను వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు.

తెలంగాణ డీవైఎ్‌ఫఐ శాఖ ప్రారంభించిన ఆన్‌లైన్‌ సంతకాల సేకరణలో.. ఒక్కరోజులోనే 30 వేల మంది డిజిటల్‌ సంతకాలు చేశారు. ఈ పిటిషన్‌ లింక్‌ను రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అధికారిక ట్విటర్‌ ఖాతాలకు ట్యాగ్‌ చేస్తున్నారు. సినీనటుడు అడివి శేష్‌, నటి సమంత.. దీనిని ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా మేం సంతకాలు చేశాం..మీరూ చేయండి’ అని పోస్ట్‌ చేశారు. కాగా, ‘అమెజాన్‌ అడవులు కాలిపోతుంటే స్పందించిన వాళ్లం… మన నల్లమల ధ్వంసమవుతుంటే మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాం. స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని నటుడు మంచు మనోజ్‌ ట్వీట్‌ చేశారు. యురేనియం తవ్వకాలపై ప్రతి పౌరుడూ స్పందించాలని మరో నటుడు రామ్‌ పిలుపునిచ్చారు. కాగా వరుణ్‌తేజ్‌, సాయిఽతేజ్‌, అనసూయ.. ‘సేవ నల్లమల’ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. అయితే అనసూయ.. రాష్ట్ర అటవీశాఖ మాజీ మంత్రి, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్నను ఇంకా మంత్రిగానే భావించి.. ఆయనను ట్యాగ్‌ చేశారు. ఆ వెంటనే పొరపాటును దిద్దుకున్నారు. మరోవైపు నల్లమలను కాపాడేందుకు హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌, దర్శకుడు పూరి జగన్నాథ్‌ ముందుకు రావాలని మరో దర్శకుడు వి.వి.వినాయక్‌ కోరారు. కాగా నటులు పవన్‌కల్యాణ్‌, విజయ్‌ దేవరకొండ, రాహుల్‌ రామకృష్ణ, దర్శకులు శేఖర్‌ కమ్ముల, సురేందర్‌రెడ్డి, నాగ్‌ అశ్విన్‌ తదితరులు ఇప్పటికే ‘సేవ్‌ నల్లమల’ ఉద్యమానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.


సీఎం కేసీఆర్‌ మనుమడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు.. యురేనియం వ్యతిరేక ఉద్యమానికి మద్దతు పలికాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ‘సేవ్‌ నల్లమల.. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిద్దాం’ అనే చిత్రాలను పోస్ట్‌ చేశాడు. వాటిని షేర్‌ చేయాలని నెటిజన్లను కోరాడు.యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రముఖులు ప్రచారం నిర్వహిస్తుండటంతో.. ‘సేవ్‌ నల్లమల’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది. శుక్రవారం ఒక్కరోజే 45 వేల ట్వీట్లతో దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. సినీనటులు పవన్‌కల్యాణ్‌, విజయ్‌ దేవరకొండ, సమంత తదితరులు చేసిన పోస్టింగ్‌లను నెటిజన్లు ఎక్కువగా రీట్వీట్‌ చేస్తున్నారు. ‘స్టాప్‌ యురేనియం మైనింగ్‌’ అనే మరో హ్యాష్‌ట్యాగ్‌ 15 వేల ట్వీట్లతో పదో స్థానంలో ఉంది.

"
"