ఆ దళిత నేతలిద్దరూ.. టీడీపీలోకి..! అన్ని దారులూ ఉండవల్లి వైపే..!

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో పార్టీల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. పలువురు ప్రముఖ నేతలు.. వరుస పెట్టి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎంపీ హర్షకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. వారు.. మంగళవారం విడివిడిగా చంద్రబాబును కలిశారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అమలాపురం రిజర్వుడు లోక్‌సభ స్థానానికి మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ పేరును టీడీపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

హర్షకుమార్ విషయమై జిల్లాలో ఉన్న సిటింగ్‌ ఎమ్మెల్యేలతోపాటు నియోజకవర్గ పరిధిలోని ఎంపిక చేసిన అభ్యర్థులనుంచి అభిప్రాయాలు సేకరించి ఆయన అభ్యర్థిత్వంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.అమలాపురంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరారు. ఇప్పుడు అక్కడ కూడా.. తేడాగా ఉండటంతో.. మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారు. మరో వైపు అమలాపురం పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి అవుతారనుకున్న దివంగత నేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాధుర్‌ ను అసెంబ్లీని నిలబెట్టాలని భావిస్తున్నారు. దీనిపైనా కసరత్తు చేస్తున్నారు. మరో వైపు ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న కీలక దళిత నేతలు.. పనబాక దంపతులు… తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

నెల్లూరు టీడీపీ నేత సోమిరెడ్డితో సంప్రదింపులు జరపడంతో… వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. టీడీపీ తరపున తిరుపతి ఎంపీ అభ్యర్తిపై ఇప్పటికీ కసరత్తు చేస్తున్నందున.. ఆమె పేరు పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో.. సీనియర్ నేతలంతా.. టీడీపీలో చేరుతున్నట్లయింది. ఓ వైపు జగన్ దళిత నేతల్ని అవమానిస్తూంటే..మరో వైపు చంద్రబాబు వారికి సాదర స్వాగతం పలుకుతున్నారు. అదీ జగన్ .. చంద్రబాబు మధ్య తేడా..!